పోస్ట్‌లు

జీవవృక్షము లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

రెండు చెట్ల యొక్క మర్మము

రెండు చెట్ల యొక్క మర్మము Mystery of two trees               దేవుడు ఆదామును హవ్వను సృజించి ఏదేను తోటలో ఉంచాడు. మానవులను సృజించిన తరువాత దేవుడు వారికిచ్చిన మొట్టమొదటి జ్ఞానం ఏమిటంటే రెండు చెట్లను గూర్చిన జ్ఞానం. ఆ రెండు చెట్లు ఏదేను తోటలో చాలా ప్రత్యేకమైనవి. ఒకటేమో మంచిచెడ్డల తెలివినిచ్చు ఫలముల చెట్టు మరొకటేమో జీవవృక్ష ఫలములనిచ్చు చెట్టు.             అసలు దేవుడు ఆ రెండు చెట్లును ఎందుకు ఆ తోటలో పెట్టాడు? ఆ రెండు చెట్లు లేకపోతే అసలు ఆదాము హవ్వలు పాపం చేసేవారు కాదు కదా! కాని ఆదాము హవ్వలు పాపం చెయ్యాలని దేవుడు ఎన్నడూ కోరుకోలేదు. అందుకే ఆ రెండు చెట్లను గూర్చిన జ్ఞానం మొదటిగా ఆదాముకు తెలియజేసాడు. “మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్షఫల ములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయ ముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను. (ఆది.కా 2:16,17) ” . మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినడం వలన మనకు మరణం తెచ్చిపెట్టాయి కాబట్టి మనం వాటిని మరణ వృక్ష ఫలములు అనవచ్చు. కనుక మరణ వృక్ష ఫలముల వలన మరణము, జీవవృక్ష ఫలముల వలన