పోస్ట్‌లు

*పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు* ‘నీవే నా దేవుడవు. దయగల నీ *ఆత్మ నన్ను నడిపించును* గాక.’ కీర్త. 143:10. మీరు ఎప్పుడైనా సముద్రంలో ఓడ ప్రయాణం చేశారా? ఓడ ఏ దిక్కునకు పోవుచున్నదో  నావికుడు ఎలా తెలుసుకొన గలడు? అందుకు వారు ఉపయోగించే సాధనమే *దిక్సూచి.* ఈ అయస్కాంత దిక్సూచి దిశను సూచించే ఒక సాధారణ పరికరం. దానిలో ఉండే అయస్కాంతపు ముల్లు అదృశ్యముగా ఉన్న అయస్కాంతపు శక్తి వల్ల దానంతటదే కదులుతూ ఎప్పుడూ ఉత్తర దిక్కునే చూపిస్తుంది. సముద్ర మార్గాన ప్రయాణిస్తున్నప్పుడు దారి కనుక్కోవడానికి ప్రజలు ఎన్నో శతాబ్దాలుగా దిక్సూచిని ఉపయోగిస్తున్నారు. అదే విధంగా ఈ లోకమనే సముద్రంలో *విశ్వాసులను నడిపించుటకు* ఆత్మ దేవుడు తన గొప్ప శక్తిని ఉపయోగిస్తున్నాడు. మనకు నడిపింపునిచ్చే ప్రాముఖ్యమైన పరిశుద్ధాత్మ దేవుని శక్తిని గురించిన కొన్ని విషయాలను వరుస పాఠాలలో నేర్చుకుందాం. ఆదికాండం మొదటి అధ్యాయం నుండి ప్రకటన గ్రంధం చివరి అధ్యాయం వరకు *పరిశుద్ధాత్మదేవుని నడిపింపు* ఉన్నది. ఆది 1:1,2లో దేవుడు చేసినదాని గురించి ఆదికాండము ఇలా చెబుతోంది, “ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.” అలా సృష్టించడానికి ఆయన గొప్ప ఆత్మ శక్తిని